మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : ఆదివారం, 26 ఆగస్టు 2018 (10:07 IST)

విద్యార్థినిలను వ్యభిచారం చేయమని ఒత్తిడి చేసిన మాట నిజమే : నిర్మలాదేవి

విద్యార్థినిలను పడుపు వృత్తి చేయమని ఒత్తిడి చేసిన మాట నిజమేనని తమిళనాడు రాష్ట్రంలోని దేవాంకూర్‌ ప్రైవేటు కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి అంగీకరించారు. ఈ మేరకు ఆమె వీడియో వాంగ్మూలం ఇచ్చారని స

విద్యార్థినిలను పడుపు వృత్తి చేయమని ఒత్తిడి చేసిన మాట నిజమేనని తమిళనాడు రాష్ట్రంలోని దేవాంకూర్‌ ప్రైవేటు కళాశాల అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి అంగీకరించారు. ఈ మేరకు ఆమె వీడియో వాంగ్మూలం ఇచ్చారని సీబీసీఐడీ పోలీసులు ప్రకటించారు.
 
కళాశాలకు చెందిన నలుగురు విద్యార్థినులను పడుపువృత్తిలోకి నెట్టేందుకు ప్రయత్నించడంతో నిర్మలా దేవిని పోలీసులు అరెస్టు చేశారు. విద్యార్థినులతో ఆమె మాట్లాడిన ఆడియో, వీడియోలు సామాజిక ప్రసారమాధ్యమాల్లో వెలువడటంతో ఆ గుట్టురట్టయ్యింది. నిర్మలాదేవి విద్యార్థినులతో ఫోన్‌లో మాట్లాడినప్పుడు 'గవర్నర్‌ తాతయ్యను మంచి చేసుకుంటే మీకు మరీ మంచిది, ఫస్ట్‌క్లాస్‌ మార్కులు వస్తాయి, ప్రభుత్వ ఉద్యోగాలు కూడా లభిస్తాయి' అంటూ చెప్పడం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించాయి. 
 
ఇకపోతే, ఈ వ్యవహారంలో నిర్మలాదేవికి అన్ని విధాలుగా సాయ పడుతూ సహకరించిన మదురై కామరాజర్‌ విశ్వ విద్యాలయానికి చెందిన అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ మురుగన్‌, మాజీ పరిశోధక విద్యార్థి కరుప్పసామిని కూడా అరెస్టు చేశారు. ఈ ముగ్గురి నివాసగృహాల్లోనూ సీబీసీఐడీ పోలీసు అధికారులు జరిపిన తనిఖీల్లో కీలకమైన దస్తావేజులు కూడా లభించాయి. 
 
ఇదిలావుంటే, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ నిర్మలాదేవి ఏడుసార్లు దాఖలు చేసిన బెయిలు పిటిషన్లు తోసివేతకు గురయ్యాయి. నిర్మలాదేవి ఏప్రిల్‌ 16న అరెస్టయ్యారు. అప్పటి నుంచి ఆమె విరుదునగర్‌ జిల్లా కోర్టు, విరుదునగర్‌ రెండో జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు, హైకోర్టు మదురై డివిజన్‌లోను పలుమార్లు దాఖలు చేసిన బెయిలు పిటిషన్లన్నీ తోసివేతకు గురయ్యాయి. దీంతో ఆమె 130 రోజులుగా జైలు జీవితం గడుపుతున్నారు.