మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2017 (14:37 IST)

కట్నం తీసుకుని పెళ్ళి చేసుకుంటున్నారా? ఐతే ఆ వివాహాలకు వెళ్ళొద్దు: నితీష్ కుమార్

వరకట్నం, బాల్య వివాహాలను బహిష్కరించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపు నిచ్చారు. ఇప్పటికే మద్యం తయారీ, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన నితీష్ కుమార్.. వరకట్నంను, బాల్య వివాహాలను బాయ

వరకట్నం, బాల్య వివాహాలను బహిష్కరించాలని బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ పిలుపు నిచ్చారు. ఇప్పటికే మద్యం తయారీ, విక్రయం, వినియోగాన్ని పూర్తిగా నిషేధించిన నితీష్ కుమార్.. వరకట్నంను, బాల్య వివాహాలను బాయ్ కాట్ చేయాలని ఆదర్శవంతమైన ప్రచారానికి శ్రీకారం చుట్టారు. మద్య నిషేధాన్ని తమ ప్రభుత్వం ఎంత పకడ్భందీగా అమలుచేసిందో, అంతే స్థాయిలో బాల్య వివాహాలు, వరకట్నాలకు వ్యతిరేకంగా పోరాడుతామని సీఎం తెలిపారు.
 
డాక్టర్ అంబేద్కర్ 126వ జయంతిని పురస్కరించుకుని నితీష్ కుమార్ మాట్లాడుతూ... వరకట్నం తీసుకుని వివాహాలు చేసుకునే పెళ్లి వేడుకలకు వెళ్లొద్దని ప్రజలకు సూచించారు. నితీష్ కుమార్, వరకట్నం తీసుకునే వారిపై పైర్ అయ్యారు. 
 
సమాజంలో ప్రధాన సమస్యగా పరిణమించిన వరకట్నాన్ని నిర్మూలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పారు. ఇంకా బాల్య వివాహాలను అరికట్టడానికి కూడా తమదైన శైలిలో ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలిపారు. సమాజానికి వ్యతిరేకంగా నెలకొన్న ఈ వికృత అంశాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.