ఆదివారం, 12 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Modified: గురువారం, 14 డిశెంబరు 2017 (16:04 IST)

కండోమ్ ప్రకటనలపై కేంద్రం సీరియస్... ఖజురహోను ఏం చేస్తారో?

ప్రసార మాధ్యమాల్లో ఇష్టానుసారం కండోమ్‌ల ప్రకటనలను వేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటి ప్రభావం పిల్లలపై పడుతోందనీ, అందువల్ల వాటిని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ ప్రకటనలను నిషేధించాలని ఉత్తర్వులను జారీ చేసింది. కండోమ్ ప్రకటనలు ఉదయం ర

ప్రసార మాధ్యమాల్లో ఇష్టానుసారం కండోమ్‌ల ప్రకటనలను వేయడంపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. వాటి ప్రభావం పిల్లలపై పడుతోందనీ, అందువల్ల వాటిని ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఆ ప్రకటనలను నిషేధించాలని ఉత్తర్వులను జారీ చేసింది. కండోమ్ ప్రకటనలు ఉదయం రావడం వల్ల పిల్లలపై దుష్ర్పభావం చూపెడుతోందని తెలిపింది.
 
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ నిబంధనలు 1994లు ఏవైతే ఉన్నాయో వాటిని సవరణ చేస్తూ రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కండోమ్ యాడ్‌లు వేసుకోవచ్చని తెలిపింది. ఈ నిబంధనలను ఎవరైనా ఉల్లంఘించినట్లయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది. కేంద్ర సమాచార శాఖ ప్రకటనతో కండోమ్‌లను తయారుచేసే ప్రైవేటు సంస్థలు డీలాపడిపోయాయి. 
 
ఇదిలావుంటే దీనిపై సోషల్ నెట్వర్కింగ్ సైట్లలో కామెంట్లు పడుతున్నాయి. కండోమ్ ప్రకటనలను నిషేధిస్తారు సరే... మరే ఖజురహోను ఏం చేస్తారూ అంటూ ప్రశ్నాస్త్రాలు సంధిస్తున్నారు.