శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 16 నవంబరు 2016 (10:03 IST)

రూ.6 వేల కోట్లు కాదు కదా.. 6 పైసలు కూడా ఇవ్వలేదు : సూరత్ వజ్రాల వ్యాపారి

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, రియల్టర్ లాల్జీ భాయ్ పటేల్‌ రూ.6000 కోట్ల రూపాయల పెద్ద నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని అంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తమని తేలిపోయింది. ఈయన తన

గుజరాత్ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి, రియల్టర్ లాల్జీ భాయ్ పటేల్‌ రూ.6000 కోట్ల రూపాయల పెద్ద నోట్లను ప్రభుత్వానికి స్వాధీనం చేశారని అంటూ వచ్చిన కథనాలన్నీ అవాస్తమని తేలిపోయింది. ఈయన తన సంస్థలో పని చేసే ఉద్యోగులకు కొత్త మోడల్ కార్లు, ఇళ్లను కానుకగా ఇస్తూ సంచలనం సృష్టించిన విషయం తెల్సిందే. అలాగే, ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అత్యంత ఖరీదైన సూట్‌ను బహుమతిగా కూడా ఇచ్చారు. 
 
ఈ నేపథ్యంలో... ఆయన తన వద్ద ఉన్న రూ.6 వేల కోట్ల నగదును ప్రభుత్వానికి అప్పగించినట్టు వార్తలు వచ్చాయి. దీనిపై ఆయన స్పందించారు. తాను ప్రభుత్వానికి ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ప్రకటించారు. అవన్నీ పుకార్లని, అందులో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు. దీంతో అంతా అవాక్కయ్యారు. దీంతో నిజానిజాలు నిర్ధారణ చేసుకోకుండా ఇలాంటి విషయాలు షేర్ చేయవద్దని, పుకార్లను వ్యాపింపచేయవద్దని అధికారులు సూచిస్తున్నారు.