సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : మంగళవారం, 2 జులై 2019 (12:54 IST)

కూరగాయలు కోసం ముప్పై రూపాయలు అడిగితే..? ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు..

ఢిల్లీలో ట్రిపుల్ తలాక్ కథ మళ్లీ తెరపైకి వచ్చింది. ఇంటికి కావలసిన కూరగాయలు కొనేందుకు డబ్బు అడిగిన భార్యకు.. ఆమె భర్త ట్రిపుల్ తలాక్ చెప్పాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.


వివరాల్లోకి వెళితే.. ఢిల్లీకి సమీపంలో ధాత్రి ప్రాంతంలో సబీర్ అనే వ్యక్తి తన భార్య సైనాబ్‌తో కలిసి జీవిస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం సైనాబ్ తన భర్త కూరగాయలు కొనేందుకు రూ.30లు అడిగింది. 
 
కానీ కావాలనే ఆ డబ్బు ఇచ్చేందుకు నిరాకరించిన భర్త.. ఆమెతో వాగ్వివాదానికి దిగాడు. ఈ వాగులాట ముదరడంతో రోడ్డుపై నిల్చుని ట్రిపుల్ తలాక్ చెప్పేశాడు. న్యాయం కోసం సైనాబ్.. సబీర్ ఇంటికి వెళ్లగా ఆమెకు ఘోర అవమానం జరిగింది. 
 
కుటుంబంతో కలిసి సైనాబ్‌ను సబీర్ దాడి చేశాడు. ముఖంపైనే ఉమ్మేశాడు. దీంతో షాకైన సైనాబ్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సబీర్‌ను అరెస్ట్ చేశారు. ఇంకా అజ్ఞాతంలోకి వెళ్లిన సబీర్ కుటుంబ సభ్యుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.