శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : గురువారం, 27 జూన్ 2019 (09:50 IST)

ప్రపంచంలోనే తొలి మహిళ : గిన్నిస్‌బుక్‌లో మహిళా దర్శకురాలిగా...

హీరో కృష్ణ సతీమణి విజయనిర్మల ఇకలేరు. ఆమె 73 యేళ్ళ వయసులో గుండెపోటుతో కన్నుమూశారు. పైగా, బాల నటిగా, హీరోయిన్‌గా, దర్శకురాలిగా విభిన్నపాత్రలను పోషించారు. ముఖ్యంగా, మహిళా దర్శకురాలిగా తన పేరును గిన్నిస్‌బుక్‌లో లిఖించుకున్నారు. ఇలా ప్రపంచంలోనే తొలి మహిళా దర్శకురాలిగా గిన్నిస్‌బుక్‌లో ఆమె చిరస్థాయిగా నిలిచిపోయారు. దీనికి కారణం.. అత్యధికంగా ఆమె 44 చిత్రాలకు దర్శకత్వం వహించడమే. 
 
మీనా అనే చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన విజయనిర్మల తన సినీ కెరీర్‌లో మొత్తం 44 చిత్రాలకు దర్శకత్వం వహించారు. 1973లో మీనా చిత్రం ద్వారా దర్శకత్వం శాఖలోకి అడుగుపెట్టిన విజయనిర్మల.. ఆ తర్వాత దేవదాసు, దేవుడే గెలిచాడు, రౌడీ రంగమ్మ, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమా హేమీలు, రామ్‌ రాబర్ట్‌ రహీం, సిరిమల్లె నవ్వింది, భోగి మంటలు, బెజవాడ బెబ్బులి, ముఖ్యమంత్రి, లంకె బిందెలు, కలెక్టర్‌ విజయ, ప్రజల మనిషి, మొగుడు పెళ్లాల దొంగాట, పుట్టింటి గౌరవం, రెండు కుటుంబాల కథ తదితర 44 సినిమాలకు దర్శకత్వం వహించారు. 
 
ఆమె సొంతగా విజయకృష్ణ అనే నిర్మాణ సంస్థను నిర్మించి ఈ బ్యానర్‌పై 15 చిత్రాలకు పైగా నిర్మించారు. అలా, ప్రపంచంలోనే అత్యధిక సినిమాలకు దర్శకత్వం వహించిన మహిళగా 2002లో గిన్నిస్‌బుక్ రికార్డులకెక్కారు. మొత్తంగా ఆమె 44 సినిమాలకు దర్శకత్వం వహించి రికార్డు సృష్టించారు. అంతేకాకుండా ఆమె బాలనటిగా కూడా అనేక చిత్రాల్లో నటించారు. ఎన్టీఆర్‌తో కలిసి 'మారిన మనిషి', 'పెత్తందార్లు', 'నిండు దంపతులు', 'విచిత్ర కుటుంబం' సినిమాల్లో నటించారు.