మంగళవారం, 7 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : సోమవారం, 15 మే 2017 (14:42 IST)

అమెరికానే టార్గెట్.. క్షిపణిని ప్రయోగించిన ఉత్తర కొరియా.. హ్వాసంగ్-12 పేరిట?

అమెరికాను ఉత్తర కొరియా టార్గెట్ చేసింది. యుద్ధానికి సై అంటూ పిలుపు నిస్తోంది. శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఉత్తర కొరియా మాత్రం దూక

అమెరికాను ఉత్తర కొరియా టార్గెట్ చేసింది. యుద్ధానికి సై అంటూ పిలుపు నిస్తోంది. శాంతియుతంగా సమస్యల పరిష్కారానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ.. ఉత్తర కొరియా మాత్రం దూకుడును ప్రదర్శిస్తోంది. తాజాగా రేంజ్ బాలిస్టిక్ మిస్సైల్‌ను ప్రయోగించిన ఉత్తరకొరియా.. ఆ ప్రయోగం సఫలమైందని ప్రకటించింది. 
 
ఈ సందర్భంగా రాజధాని నగరమైన ప్యోంగ్ యాంగ్‌లో వేడుకలు నిర్వహించారు. త్వరలోనే అమెరికా భూభాగాన్ని టార్గెట్ చేయగల క్షిపణిని తయారు చేస్తామని ఉత్తర కొరియా ప్రకటించిన నేపథ్యంలో.. ఆదివారం ఉదయం ఉత్తరకొరియా.. ఇంటర్మీడియట్ రేంజ్ క్షిపణిని ప్రయోగించింది. 2వేల కి.మీ ఎత్తులో 800కి.మీ దూరం ప్రయాణించిన క్షిపణి.. జపాన్ సముద్ర జలాల్లో కూలిపోయింది. 
 
కాగా, దక్షిణ కొరియా అధ్యక్షుడిగా మూన్ బాధ్యతలు చేపట్టిన అనంతరం ఉత్తరకొరియా చేపట్టిన తొలి క్షిపణి ప్రయోగం ఇదే. ఈ క్షిపణి ప్రయోగాన్ని ప్యోంగ్ యాంగ్ మీడియా హ్వాసంగ్-12గా పేర్కొంది. అమెరికా మిలటరీ బలగాలతో తమను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే.. భారీ ప్రతిఘటన తప్పదని హెచ్చరించింది.