మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : మంగళవారం, 1 డిశెంబరు 2020 (22:27 IST)

ముస్లీమ్‌లకు టిక్కెట్లు ఇవ్వం : కర్నాటక మంత్రి

ఎన్నికల్లో తాము ముస్లీమ్‌లకు టిక్కెట్లు ఇచ్చే ప్రసక్తే లేదంటూ కర్నాటకకు చెందిన బిజెపి మంత్రి కె ఎస్‌ ఈశ్వరప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో ఏ కులానికైనా టిక్కెట్లు ఇచ్చుకుంటామని, అది ఒక్క లింగలకు కావచ్చు, కురబలకు కావచ్చు, బ్రహ్మణులకు కావచ్చు, ఎవరికైనా టిక్కెట్లు ఇస్తాము కానీ ఒక్క ముస్లీమ్‌లకు కూడా టిక్కెట్‌ ఇవ్వబోమని ఈశ్వరప్ప వ్యాఖ్యలు చేశారు. వీటిపై ప్రస్తుత కర్నాటక రాష్ట్రంలో వివాదం చెలరేగుతోంది.