1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 ఫిబ్రవరి 2022 (14:33 IST)

మోడీ సర్కారు జీరో సమ్ బడ్జెట్ : రాహుల్ గాంధీ ట్వీట్

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికిగాను వార్షిక బడ్జెట్‌ను మంగళవారం ప్రవేశపెట్టింది. ఈ బడ్జెట్‌పై మిశ్రమ స్పందన వ్యక్తమవుతుంది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పందిస్తూ, మోడీ సర్కారు జీరో సమ్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టిందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. 
 
వేతన జీవులకు శూన్యహస్తాలు చూపించారని వ్యాఖ్యానించారు. మధ్యతరగతి, బడుగు, బలహీన, పేదలకు, యువతకు, రైతులకు, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు కూడా మొండి చేయి చూపించారంటూ ఆయన ట్వీట్ చేశారు. 
 
కాగా, విత్తమంత్రి నిర్మలమ్మ రూ.39.45 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. అయితే, ఈ బడ్జెట్ అన్ని రంగాలను సంతృప్తిపరచలేక పోయిందనే విమర్శలు వస్తున్నాయి. పలువురు ఆర్థిక రంగ నిపుణులు కూడా అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతేకాకుండా, ఈ బడ్జెట్ స్టాక్ మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపింది. ఫలితంగా స్టాక్ మార్కెట్ నష్టాల్లోకి జారుకుంది.