ఛత్తీస్‌గఢ్: నర్సుపై సామూహిక అత్యాచారం.. కట్టేసి దృశ్యాలను రికార్డ్ చేసి?
మహిళలపై అఘాయిత్యాలు రోజురోజుకీ పెచ్చరిల్లిపోతున్నాయి. ఛత్తీస్‌గఢ్‌లోని మహేంద్రగఢ్ జిల్లాలోని ఓ గ్రామంలో నర్సుపై సామూహిక అత్యాచారం చోటుచేసుకుంది. హెల్త్ సెంటర్‌లో బంధించిన నర్సును నలుగురు వ్యక్తులు బంధించి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఆపై నర్సుపై అత్యాచారానికి సంబంధించిన దృశ్యాలను రికార్డు చేశారు. ఈ విషయం ఎవరికైనా చెబితే చంపేస్తామని బెదిరించారు.
వివరాల్లోకి వెళితే.. బాధిత మహిళ హెల్త్ సెంటర్‌లో నర్సుగా విధులు నిర్వర్తిస్తోంది. శుక్రవారం హెల్త్ సెంటర్ ఆమె ఒంటరిగా విధులు నిర్వర్తించడం నిందితులు గుర్తించారు. ఆ సమయంలో హెల్త్ సెంటర్‌లోకి ప్రవేశించి నర్సును కట్టేసి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు రంగంలోకి దిగారు.
బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టుగా సీనియర్ పోలీసు అధికారి నిమేష్ బరయ్య తెలిపారు. నిందితుల్లో ముగ్గురిని అరెస్ట్ చేశామని చెప్పారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడని తెలిపారు. నిందితుల్లో మైనర్ కూడా వున్నట్లు పోలీసులు తెలిపారు.