పార్శిల్‌లో పాము... ఓపెన్ చేయగానే బుసకొట్టిన కింగ్ కోబ్రా

Last Updated: సోమవారం, 26 ఆగస్టు 2019 (14:31 IST)
ఒడిషాకు చెందిన ఓ వ్యక్తి తన ఇంటికి వచ్చిన ఓ పార్శెల్‌ను విప్పి చూస్తుండగా అందులోనుంచి ఓ పాము ప్రత్యక్షమైంది. ఈ పామును చూడగానే ఆయన భయాందోళనకు గురయ్యాడు. పార్శిల్ విప్పగానే పాము బుసకొడుతూ పడగ విప్పింది. ఈ షాకింగ్‌ నుంచి ఆయన తేరుకునేందుకు కొంత సమయం పట్టింది.

తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, విజయవాడకు చెందిన ముత్తుకుమరన్ అనే వ్యక్తి ఇటీవల తన మకాంను ఒడిషాకు మార్చాడు. దీంతో ఒడిషాలోని మయూర్ భంజ్‌లోని రైరంగాపూర్ ఏరియాలో ఓ ఇంటిలో ఉంటున్నాడు.

ఈయన విజయవాడ ఇంటి నుంచి కొన్ని సామానులను పార్శిల్‌లో ఒడిషాకు కొరియర్‌లో తరలించాడు. ఈ కొరియర్‌ నుంచి వచ్చిన పార్సిల్‌ను విప్పుతుండగా అందులోంచి పాము బయటికి రావడంతో విస్తుపోయారు. పార్సిల్‌లో పాము బయటపడిన విషయాన్ని ముత్తుకుమరన్‌ అటవీ అధికారులకు తెలుపగా వారు అక్కడికి చేరుకుని పామును అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

15 రోజుల క్రితం తాను ప్రైవేట్‌ కొరియర్‌ ఏజెన్సీ నుంచి పార్సిల్‌ను బుక్‌ చేశానని ముత్తుకుమరన్‌ తెలిపారు. ఈనెల 9న గుంటూరు నుంచి ఈ పార్సిల్‌ తనకు పంపారని చెప్పారు. గృహోపకరణాలతో కూడిన ఈ పార్సిల్‌ను విప్పిచూస్తుండగా అందులో​ పాము కనిపించడంతో షాక్‌కు గురయ్యానని తెలిపారు. ఒడిషాకు పార్సిల్‌ను తరలించే క్రమంలో పాము ఇందులోకి చేరిఉంటుందని ఆయన చెప్పారు.దీనిపై మరింత చదవండి :