ఇస్రోలో ఉద్యోగాలు.. దరఖాస్తు చేసుకోండి మరి..
ఇస్రోలో టెక్నికల్ అసిస్టెంట్, డ్రాఫ్ట్ మ్యాన్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (ఇస్రో) బెంగళూరులోని హ్యూమన్ ఫ్లైట్ సెంటర్‌లో ఈ నియామక ప్రక్రియ జరుగబోతుంది.
దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. దరఖాస్తుకు సెప్టెంబర్ 13 చివరి తేదీ. రాతపరీక్ష, స్కిల్ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. అభ్యర్థులు ఐఎస్ఆర్వోడాట్‌జీవోవీడాట్ఇన్ అనే వెబ్ సైట్ ద్వారా అదనపు వివరాలు పొందవచ్చు.
బెంగళూరులోని హ్యూమన్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌లో ఈ నియామక ప్రక్రియలో భాగంగా మొత్తం 86 ఖాళీలున్నాయి. టెక్నీషియన్ బీ పోస్టులు 39, డ్రాఫ్ట్స్‌మ్యాన్ బీ పోస్టులు 12, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టులు 35 ఉన్నాయి.