స్కానింగ్ కోసం వెళితే... పాడుపనికి పాల్పడిన టెక్నీషియన్
అనారోగ్యంతో బాధపడుతున్న ఓ యువతి వైద్యుల వద్దకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన వైద్యులు.. స్కాన్ తీయించాలని సలహా ఇచ్చారు. దీంతో వైద్యుల సూచన మేరకు ఆ యువతి స్కాన్ తీసుకునేందుకు ఓ డయాగ్నస్టిక్ సెంటర్‌కు వెళ్లింది. కానీ, స్కానింగ్ సెంటర్‌లో టెక్నీషియన్ చేసిన పాడుపనికి ఆమె పోలీసులను ఆశ్రయించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
హైదరాబాద్ నగరంలోని గోల్కొండ ప్రాంతానికి చెందిన 22 యేళ్ళ యువతి... అనారోగ్యంతో బాధపడుతూ వైద్యుడుని సంప్రదించింది. ఆయన సూచన మేరకు విజయనగర్ కాలనీలో ఉన్న విజయా డయాగ్నస్టిక్ సెంటర్‌కు సిటీ స్కానింగ్ తీయించుకునేందుకు వెళ్లింది.
అక్కడ టెక్నీషియన్‌గా పని చేస్తున్న ఓ యువకుడు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించాడు. తాకకూడని చోట తాకాడు. దీనిపై బాధితురాలు హుమయూన్ నగర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. నిందితుడిని అరెస్ట్ చేశామని, ప్రస్తుతం అతన్ని విచారిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.