మంగళవారం, 23 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (13:02 IST)

మాజీ ప్రధానికి ఎన్.ఎస్.జి భద్రత తొలగింపు

మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌కు కొనసాగిస్తూ వచ్చిన భద్రతను కేంద్ర ప్రభుత్వం తొలగించింది. అలాగే, మరికొందరికి సెక్యూరిటీని తగ్గించింది. తాజాగా, మన్మోహన్ సింగ్ కు ఉన్న స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ) సెక్యూరిటీని కేంద్రం ఉపసంహరించింది. ఆయనను సీఆర్ఫీఎఫ్ బలగాల భద్రత కిందకు తీసుకొచ్చింది. దేశంలోని ప్రముఖుల భద్రతను సమీక్షించే విభాగం నివేదికల ఆధారంగా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
 
దీనిపై కేంద్ర హోంశాఖకు చెందిన ఓ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ప్రముఖుల జీవితాలకు ముప్పు ఎంత వరకు ఉందనే వార్షిక సమీక్ష సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మన్మోహన్ సింగ్‌కు ఎస్పీజీ భద్రతను తొలగించినప్పటికీ... ఆయనకు ఉన్న జెడ్‌ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కొనసాగుతుందని చెప్పారు. మరోవైపు, పదేళ్ల పాటు దేశ ప్రధానిగా ఉన్న మన్మోహన్... తన భద్రత విషయంలో ఎలాంటి ఆందోళనకు గురికావడం లేదు. 
 
ఇప్పటికే, బీఎస్పీ అధినేత్రి మాయావతి, ఎస్పీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్‌తో పాటు.. పలు రాష్ట్రాలకు చెందిన కీలక నేతలకు కేంద్రం భద్రత తొలగించడం లేదా కుదించడం జరిగింది. కానీ, మావోయిస్టుల నుంచి ముప్పు ఎదుర్కొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు మాత్రం ఎస్పీజీ భద్రతను కొనసాగించాలని కేంద్రం నిర్ణయించింది.