సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 3 ఏప్రియల్ 2023 (09:25 IST)

బాలుడి మలం ద్వారంలోకి చొచ్చుకుని పోయిన గునపం...

iron rod
ఒరిస్సా రాష్ట్రానికి చెందిన ఓ బాలుడికి మలం ద్వారా గునపం ఒకటి చొచ్చుకుని పోయింది. దీన్ని వైద్యులు నాలుగు గంటల పాటు శ్రమించి ఆపరేషన్ చేసి బయటకు తీశారు. ఈ ఘటన ఒరిస్సా జిల్లా కొంధమాల్ జిల్లా కోడగడ్ ఠాణా పరిధిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
సువర్ణగిరి ప్రాంతానికి చెందిన సనాతన పటగురు అనే వ్యక్తి కుమారుడు శక్తి పటగురు. వయసు 16 యేళ్లు. శనివారం పాఠశాలకు వెళ్లాడు. తరగతి గదులపైకి ఎక్కి సిమెంట్ రేకులు తొలగిస్తుండగా, ఓ రేకు విరిగిపోయి కిందకు జారాడు. అదేసమయంలో అక్కడే ఓ కార్మికుడు గునపం పట్టుకుని వుండగా, కిందపడుతున్న బాలుడి మలంద్వారంలోకి సరిగ్గా చొచ్చుకునిపోయింది. దీంతో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు 
 
గునపం తీసేందుకు అక్కడ సాధ్యపడక పోవడంతో ఎమ్కేసీజీ ప్రభుత్వ వైద్యశాళకు తీసుకెళ్లారు. ఆ ఆస్పత్రి వైద్యులు రాత్రి 8 గంటల నుంచి అర్థరాత్రి 12 గంటల వరకు శస్త్ర చికిత్స చేసి గునపాన్ని తొలగించారు. బాలుడి ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు.