ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : సోమవారం, 16 అక్టోబరు 2023 (18:54 IST)

భారత్ మాతాకి జై అన్నవారికే భారత్‌లో చోటు : కేంద్ర మంత్రి కైలాశ్ చౌదరి

Kailash Choudhary
ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో సహాయ మంత్రిగా ఉన్న కైలాశ్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్ మాతాకీ జై అన్నవారికే దేశంలో చోటు ఉంటుందన్నారు. ఆయన తాజాగా హైదరాబాద్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొని ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 
 
భారత్‌లో ఉండాలనుకునేవారు తప్పకుండా భారత్ మాతాకీ జై అనాల్సిందేనని చెప్పారు. అలాగే, హైదరాబాద్ నగరంలో ప్రజాప్రతినిధులు వాడుతున్న  భాషపై ఆయన కామెంట్స్ చేశారు. ఇలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాల్సిందేనని అన్నారు.
 
రాష్ట్రం (తెలంగాణ)లో జాతీయవాద ఆలోచనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. భారత్‌లో ఉంటూ పాకిస్థాన్ జిందాబాద్ అంటారా? అని ప్రశ్నించారు. 'వందేమాతరం', 'భారత్ మాతా కీ జై' అన్న వారికే దేశంలో చోటు ఉంటుందని స్పష్టం చేశారు. 
 
'ఎవరైతే 'భారత్ మాతా కీ జై' అనరో, ఎవరికైతే హిందూస్థాన్ మీద, భారత్ మీద విశ్వాసం లేదో, ఎవరైతే 'పాకిస్థాన్ జిందాబాద్' అంటారో వారు పాకిస్థాన్ వెళ్లిపోవాల్సిందే. అలాంటి వారికి ఇక్కడ స్థానం లేదు' అని మంత్రి కైలాశ్ చౌదరి తేల్చి చెప్పారు.