శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 23 మే 2017 (13:34 IST)

ఆర్మీ జీప్‌కు అరుంధతి రాయ్‌ని కట్టేయాల్సింది: మెగాస్టార్ మామయ్య ట్వీట్ వివాదం

బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ సరికొత్త వివాదానికి తెరలేపారు. కాశ్మీర్ వేర్పాటువాదుల పట్ల రచయిత అరుంధతీ రాయ్‌ దృక్పథం సరికాదనే కోణంలో బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ కొత్త వివాదానికి

బాలీవుడ్ నటుడు, బీజేపీ ఎంపీ పరేశ్ రావల్ సరికొత్త వివాదానికి తెరలేపారు. కాశ్మీర్ వేర్పాటువాదుల పట్ల రచయిత అరుంధతీ రాయ్‌ దృక్పథం సరికాదనే కోణంలో పరేశ్ రావల్ కొత్త వివాదానికి తెరలేపారు. శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో మెగాస్టార్ చిరంజీవికి మామయ్యగా నటించిన రావల్.. కాశ్మీర్‌లో రాళ్ల దాడి నుంచి కాపాడుకునేందుకు స్థానికుడిని బదులు రచయిత అరుంధతీ రాయ్‌ని జీప్‌కు కట్టేయాలన్నారు. 
 
ట్విట్టర్ వేదికగా రావల్ స్పందిస్తూ.."రాళ్లు విసిరేవాడికి బదులు ఆర్మీ జీప్‌కు అరుంధతి రాయ్‌ని కట్టేయండి" అని పోస్టు చేశారు. గత నెలలో ఓ సైనికాధికారి రాళ్ల దాడి నుంచి తప్పించుకునేందుకు "మానవ కవచంగా" ఓ స్థానికుడిని జీప్ ముందు కట్టేసి తీసుకెళ్లడం వివాదానికి దారితీసిన సంగతి తెలిసిందే.  
 
అయితే రావల్ ట్వీట్‌తో నెటిజన్లకు కొత్త ఆయుధం దొరికినట్లైంది. ఇదే అదనుగా కాశ్మీర్ పీడీపీ-బీజేపీ కూటములపై కాంగ్రెస్ మాటల దాడి మొదలెట్టింది. ఈ ఘటనపై డిగ్గీ రాజా స్పందిస్తూ.."బీజేపీ-పీడీపీలకు చెందిన వ్యక్తిని పోలీసు జీపుకు ముందు ఎందుకు కట్టేయకూడదు?" అని ట్వీట్ చేశారు. కేవలం ప్రచారం కోసమే కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దారుణమని కాలమిస్టు శోభాడే, రావల్‌కి కౌంటర్ ఇచ్చారు.
 
ప్రధానమంత్రి నరేంద్రమోదీని గట్టిగా విమర్శించే వారిలో ముందుండే అరుంధతీ రాయ్.. "ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్" నవలకు బుకర్ ఫ్రైజ్ రావడంతో 1997 నుంచి అరుంధతీ రాయ్ పేరు మార్మోగిపోయింది. అప్పట్నుంచి ఆమె దేశ విదేశాల్లో జరుగుతున్న మానవ హక్కులపై గళం వినిపిస్తూ వస్తున్నారు. ఆమె రచించిన తాజా నవల "ది మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్" వచ్చే నెలలో విడుదల కానున్నట్టు సమాచారం.
 
అలాంటి అరుంధతి రాయ్‌పై రావెల్ వివాదాస్పదమైన ట్వీట్ చేయడం దారుణమన్నారు. పరేశ్ రావెల్ ట్వీట్‌కు 18 గంటల్లో 5.8 వేల రీట్వీట్స్ రాగా.. 11 వేల లైక్‌లు.. 2.6 కామెంట్స్‌ వచ్చాయి. హింస, మహిళలపై దాడులను ప్రోత్సహించేలా రావెల్ ట్వీట్ ఉందంటూ విమర్శలు వెల్లువెత్తాయి.