ఆదివారం, 17 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శుక్రవారం, 12 మే 2017 (13:11 IST)

13 యేళ్ళ బాలికపై పాస్టర్ అత్యాచారం... 40 యేళ్ళ జైలుశిక్ష

కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో 13 యేళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కూడా ఓ పాస్టరే. ఈ కేసును విచారించిన కోర్టు.. ముద్దాయిగా తేలిన ఫాస్టర్‌కు 40 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్

కేరళ రాష్ట్రంలోని త్రిశూర్‌లో 13 యేళ్ళ బాలిక అత్యాచారానికి గురైంది. ఈ అఘాయిత్యానికి పాల్పడింది కూడా ఓ పాస్టరే. ఈ కేసును విచారించిన కోర్టు.. ముద్దాయిగా తేలిన ఫాస్టర్‌కు 40 యేళ్ళ జైలుశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. తాజాగా వెలువడిన ఈ తీర్పు వివరాలను పరిశీలిస్తే... 
 
సనల్ కె జేమ్స్ అనే 35 ఏళ్ల పాస్టర్ త్రిశూర్ సమీపంలోని పీచీ ప్రాంతంలోని సాల్వేషన్ ఆర్మీ చర్చ్ పాస్టరుగా పనిచేస్తున్నాడు. పాస్టర్ 2013 నుంచి 2015 వరకు తన అధికారిక నివాస గృహంలోనే 13 యేళ్ల బాలికపై పలుసార్లు అత్యాచారం చేశాడని కోర్టు విచారణలో తేలింది. దీంతో పాటు మరో మైనర్ బాలికపై కూడా పాస్టర్ అత్యాచారం చేశాడని పోలీసుల దర్యాప్తులో వెలుగుచూసింది. 
 
దీంతో పోస్కో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు బాధిత బాలిక కోర్టులో కనిపించకుండా ప్రత్యేక బాక్సులో ఉంచి ఆమె వాంగ్మూలాన్ని జడ్జి నమోదు చేశారు. 32 మంది సాక్షులు, 16 డాక్యుమెంట్లను కోర్టులో సమర్పించగా బాలికలపై పాస్టర్ అత్యాచారం చేశాడని రుజువు అయింది. దీంతో కీచకుడైన పాస్టర్‌కు 40 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ సెషన్స్ జడ్జి నిక్సన్ జోసెఫ్ తీర్పునిచ్చారు.