1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 29 జులై 2023 (10:32 IST)

పోలీస్ స్టేషన్‌లోనే చికెన్ కూర వండి వడ్డించారు.. వీడియో వైరల్

Pathanamthitta cops
Pathanamthitta cops
పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే నేరస్తుల పట్ల చాలా కఠినంగా వ్యవహరించడం చూస్తాం. అయితే ఖాకీ యూనిఫాం ధరించిన వారి మదిలో ఎన్నో సరదా విషయాలు దాగి ఉంటాయని ఎవరికీ తెలియదు. ఈ పరిస్థితిలో పోలీస్ స్టేషన్ లోనే చికెన్ కూర వండి వడ్డించిన ఘటన కేరళలో చోటుచేసుకుంది. 
 
కేరళ రాష్ట్రంలోని పతనంతిట్ట జిల్లాలోని ఇలవంతిట్ట పోలీస్ స్టేషన్‌లో, యూనిఫాంలో ఉన్న పోలీసులు చికెన్ కర్రీ గ్రేవీ వండి రుచి చూశారు. దాన్ని వీడియోగా కూడా రికార్డు చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారు. దుకాణానికి వెళ్లి చికెన్ కొనడం నుంచి ఉల్లిపాయలు కోయడం, అల్లం వెల్లుల్లి తొక్కలు తీయడం, మసాలా దినుసులతో వండి వడ్డించడం వరకు బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో వీడియో బాగా ఎడిట్ చేయబడింది. అధికారులకు భోజనం పంచి ఒకరికొకరు తినిపించినట్లు కూడా వీడియోలో చూపించారు.
 
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీనికి ఇప్పటివరకు 9 లక్షలకు పైగా లైక్‌లు, 6 వేలకు పైగా కామెంట్లు వచ్చాయి. ఈ వీడియో చూసిన కొందరు పోలీసులపై ప్రశంసలు కురిపిస్తున్నారు. వారం రోజుల క్రితం జరిగిన ఈ ఘటనను ఓ పోలీసు అధికారి ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై సౌత్ జోన్ ఐజీని వివరణ కోరారు.