శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : సోమవారం, 29 మార్చి 2021 (03:46 IST)

పవార్, అమిత్‌షా రహస్య భేటీ?

మహారాష్ట్రలో చెలరేగిన పరిణామాల నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో ఎన్సీపీ అధినేత పవార్ భేటీ అయ్యారన్న వార్తపై కేంద్ర హోంమంత్రి అమిత్‌షా స్పందించారు.

వీరిద్దరి మధ్య జరిగిన రహస్య సమావేశం వివరాల్ని చెప్పేందుకు అమిత్‌షా నిరాకరించారు. ‘ప్రతిదీ బహిరంగపరచవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు.’’ అని షా వ్యాఖ్యానించారు.

ఈ విషయాన్నే విలేకరులు పదే పదే నొక్కివక్కాణించినా, షా మాత్రం అసలు విషయాన్ని బయట పెట్టకపోవడం గమనార్హం.

మహారాష్ట్ర రాజకీయాల్లో అనిల్ దేశ్‌ముఖ్ వ్యవహారం తీవ్ర కలకలమే రేపింది. దీంతో ఉద్ధవ్ ప్రభుత్వం ఇరకాటంలో పడిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్సీపీ అధినేత శరద్ కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో భేటీ అయ్యారన్న వార్తలొచ్చాయి.