మంగళవారం, 4 ఫిబ్రవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 1 జూన్ 2017 (13:07 IST)

మగనెమలి ఆ పని చేయదు.. కన్నీళ్ల ద్వారానే గర్భం.. అందుకే అది జాతీయ పక్షి: మహేశ్ చంద్ర

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే వ్యాఖ్యలపై రాజస్థాన్ హైకోర్టు జడ్జి మహేశ్ చంద్ర వివరణ ఇచ్చారు. ఓవైపు దేశవ్యాప్తంగా గోమాంస నిషేధంపై నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలన

ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే వ్యాఖ్యలపై రాజస్థాన్ హైకోర్టు జడ్జి మహేశ్ చంద్ర వివరణ ఇచ్చారు. ఓవైపు దేశవ్యాప్తంగా గోమాంస నిషేధంపై నిరసనలు వెల్లువెత్తుతున్నప్పటికీ.. ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని మహేశ్ చంద్ర సంచలన కామెంట్స్ చేశారు. నేపాల్ ఇప్పటికే ఆవును జాతీయ జంతువుగా ప్రకటించిందని గుర్తు చేశారు. కాబట్టి భారత్ కూడా ఆత్మపరిశీల చేసుకుని ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలని సూచించారు. 
 
ఆవును జాతీయ జంతువుగా ప్రకటించాలనే డిమాండ్‌కు లౌకిక వాదంతో సంబంధంతో లేదన్నారు. ఈ సందర్భంగా ఆవును జాతీయ జంతువుగా ఎందుకు ప్రకటించాలనేందుకు ఓ ఉదాహరణ కూడా ఇచ్చారు. నెమళ్లు బ్రహ్మచారులు కావడం ద్వారానే వాటిని జాతీయపక్షిగా ప్రకటించారని విస్తుపోయే వ్యాఖ్యలు చేశారు. అవి శృంగారంలో పాల్గొనవని మహేష్ చంద్ర అన్నారు.
 
మగనెమలి బ్రహ్మచారిగానే ఉండిపోతుందని ఆడ నెమలితో అసలు శృంగారంలో పాల్గొనదని.. మగ నెమలి కన్నీళ్లు తాగడం ద్వారానే ఆడ నెమలి గర్భం దాలుస్తుందని, అందుకే శ్రీకృష్ణుడి లాంటి వాడు నెమలి పించాన్ని తలపై ధరించాడని మహేశ్ చంద్ర వ్యాఖ్యానించారు.