గురువారం, 19 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 20 జులై 2022 (10:54 IST)

కిసాన్ సమ్మాన్ నిధి 12వ విడత.. e-KYC తప్పనిసరి.. ఎలాగంటే?

Farmers
Farmers
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి నగదును కేంద్రం రైతుల ఖాతాలో సంవత్సరానికి రూ. 6000 జమ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి ద్వారా 11 విడతలుగా నగదును అందించింది. ఈ-కేవైసీ పూర్తి చేసిన వారికే ఖాతాలో నేరుగా నగదు జమచేస్తున్నారు అధికారులు. 
 
ప్రస్తుతం అన్నదాతలు 12వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా కేంద్రం ప్రభుత్వ సమాచారం ప్రకారం ఆగస్ట్ చివరి వారంలో లేదా సెప్టెంబర్ మొదటి వారంలో రైతుల ఖాతాలకు నగదను పంపనున్నారు. 
 
అయితే ఆ నగదు పొందాలంటే ప్రతి లబ్దిదారుడు ముందుగా ఈకేవైసీ (e-KYC)ని తప్పనిసరి పూర్తి చేయాలి. జూలై 31లోగా e-KYCని పూర్తిచేయాలని కేంద్రం గడువు విధించింది.
 
e-KYC నమోదు ఇలా..
ఈ-కేవైసీ ధ్రువీకరణను రైతులు యాప్‌ ద్వారా పీఎం కిసాన్‌ పోర్టల్‌లో ఉచితంగా చేసుకోవచ్చు. మీ సేవ, ఈ సేవ, ఆన్‌లైన్‌ కేంద్రాల్లో కూడా రైతులు నమోదు చేసుకోవచ్చు. స్మార్ట్‌ ఫోన్‌ ఉన్నవారు www.pmkisan.gov.in లింక్‌ను ఓపెన్‌ చేయగానే అందులో ఈ-కేవైసీ అప్‌డేట్‌ వస్తుంది. 
 
దానిపై క్లిక్‌ చేసి ఆధార్‌ నంబర్‌ నమోదు చేయాలి. అప్పుడు ఆధార్‌ కార్డుకు లింకై ఉన్న సంబంధిత మొబైల్‌ ఫోన్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్‌ చేయగానే గెట్‌ పీఎం కిసాన్‌ ఓటీపీ ఆప్షన్‌పై క్లిక్‌ చేయాలి. మళ్లీ ఫోన్‌కు వచ్చిన ఓటీపీని నమోదు చేసి సబ్మిట్‌ క్లిక్‌ చేస్తే ఈ-కేవైసీ అప్‌డేట్‌ అవుతుంది.