దేశ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం.. ప్రధాని నరేంద్ర మోదీ

PM modi
సెల్వి| Last Updated: బుధవారం, 5 ఆగస్టు 2020 (14:45 IST)
PM modi
దేశ చరిత్రలో ఇదో సువర్ణాధ్యాయం అని ప్రధాన మంత్రి మోదీ పేర్కొన్నారు. అయోధ్యలో రామాలయం నిర్మాణం నిరీక్షణ వందల ఏళ్ల తర్వాత ఫలించిందని మోదీ తెలిపారు. నేటితో రామజన్మభూమికి విముక్తి కలిగిందన్నారు. ఎందరో త్యాగాల ఫలితమే రామాలయం నిర్మాణం అని పేర్కొన్నారు. రామాలయం నిర్మాణానికి భూమి పూజ అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో మోదీ ప్రసంగించారు.

ఈ రోజు భారతదేశమంతా రామమయం అయింది. కోటాను కోట్ల మంది హిందువులకు ఈ రామాలయం నిర్మాణం ఎంతో ముఖ్యమైనది. ఈనాటి జయజయ ధ్వానాలు శ్రీరాముడికి వినిపించకపోవచ్చు.. కానీ ప్రపంచంలో ఉన్న కోట్ల మంది భక్తులకు వినిపిస్తున్నాయని మోదీ పేర్కొన్నారు.

మందిరం నిర్మాణానికి భూమి పూజ చేయడం మహద్భాగ్యం అని అన్నారు. ఈ మహద్భాగ్యాన్ని రామమందిరం ట్రస్టు అవకాశం కల్పించిందన్నారు. రామమందిరం ఇకపై భవ్య మందిరంగా రూపుదిద్దుకోబోతుందని తెలిపారు.



దీనిపై మరింత చదవండి :