సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 16 మే 2022 (13:11 IST)

కుశినగర్ నుంచి నేపాల్‌కు ప్రధాన నరేంద్ర మోడీ

pmmodi
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మరో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ దఫా ఆయన నేపాల్ దేశాన్ని ఎంచుకున్నారు. బుద్ధ పౌర్ణిమ సందర్భంగా నేపాన్ ప్రధాని షేర్ బహూదర్ ఆహ్వానం మేరకు ప్రధాని మోడీ ఖాట్మండుకు వెళ్లనున్నారు. 
 
ఇందుకోసం ముందుగా ఆయన ఢిల్లీ నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కుశినగర్‌కు చేరుకుంటారు. అక్కడ మాయాదేవి ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేస్తారు. పిమ్మట కుశి నగర్ నుంచి ఆయన ఖాట్మండుకు బయలుదేరి వెళ్తారు. 
 
లుంబిని డెవలప్‌మెంట్ ట్రస్ట్ నిర్వహించే కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొంటారు. లుంబిని గౌతమ బుద్ధుని జన్మస్థలమైన విషయం తెల్సిందే. అందుకే  ఈ ప్రాంతాన్ని బౌద్ధ సంస్కృతి, వారసత్వం కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. 
 
దీనికి భారత్ కూడా ఆర్థిక సాయం చేస్తుంది. ఈ కేంద్ర నిర్మాణానికి ప్రధాని మోడీ శంకుస్థాపన చేస్తారు. మరోవైపు, ఈ పర్యటన సమయంలో ఇరు దేశాల మధ్య ఐదు కీలక అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయనున్నారు.