సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 2 డిశెంబరు 2023 (13:01 IST)

రూ.20లక్షల లంచం తీసుకున్న ఈడీ అధికారి.. మదురైలో అరెస్ట్

Money
తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి నుంచి 20 లక్షల రూపాయల లంచం తీసుకున్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారిని మదురైలో పోలీసులు అరెస్ట్ చేశారు.
 
 విచారణలో భాగంగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కార్యాలయాలు, అధికారుల నివాసాల్లో కూడా పోలీసు అధికారులు సోదాలు చేసినట్లు తెలుస్తోంది. ఈ ఆపరేషన్‌లో పలు కీలక పత్రాలు పోలీసుల చేతికి చిక్కాయి. 
 
కాగా, తమిళనాడులో ‘ఈడీ’ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థ అధికారిని అరెస్టు చేయడం ఇదే తొలిసారి. అరెస్టు చేసిన అధికారి అంకిత్ తివారీగా గుర్తించబడ్డారు. డిసెంబర్ 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు.