శుక్రవారం, 1 మార్చి 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-01-2023 శనివారం దినఫలాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా...

Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక బ॥ పంచమి సా.4.34 పుష్యమి రా.7.05 వర్ణ్యము లేదు. ఉ.దు. 6.16 ల 7.45.
 
మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన సర్వదా పురోభివృద్ధి కానవస్తుంది.
 
 
మేషం :- వస్త్ర, ఫ్యాన్సీ, స్టేషనరీ వ్యాపారులకు పురోభివృద్ధి కానవస్తుంది. గృహంలో మార్పులు చేర్పులకు అనుకూలిస్తాయి. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. బంధువులను కలుసుకుంటారు. స్త్రీల మాటకు ఇంటా బయటా మంచి స్పందన లభిస్తుంది. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
 
వృషభం :- ఉమ్మడి కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. ప్రింటింగ్ రంగాల వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు పెండింగ్ పనులు పూర్తి చేసే విషయంలో తోటివారి సహకారం లభిస్తుంది. వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు.
 
మిథునం :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఉత్సాహాన్నిస్తాయి. మీ సంతానం కోసం ధనం బాగావెచ్చిస్తారు. మీ తప్పులను సరిదిద్దుకోవటానికి యత్నించండి. పత్రికా సిబ్బందికి యాజమాన్యం తీరు ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. గృహమునకు కావలసిన వస్తువులు కొనుగోలు చేస్తారు.
 
కర్కాటకం :- స్త్రీల మీశ్రమకు తగిన గుర్తింపు, ప్రతిఫలం లభిస్తాయి. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వటం మంచిది కాదని గ్రహించండి. దుబారా ఖర్చులు అధికం. పారిశ్రామిక రంగాల వారికి ప్రభుత్వ అధికారుల నుంచి అభ్యంతరాలెదుర్కోవలసి వస్తుంది.
 
సింహం :- వస్త్ర, వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. ప్రముఖులు కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. నేడు చేద్దామనుకున్న పనులు రేపటికి వాయిదా వేస్తారు. మిత్రులు, మీ జీవితభాగస్వామితో కలహాలు తలెత్తుతాయి. ఆత్మీయుల హితవు మీపై బాగా పనిచేస్తుంది.
 
కన్య :- వ్యాపారాల్లో పోటీని తట్టుకుంటారు. స్త్రీలకు ఏ విషయంలోనూ మనస్థిమితం ఉండదు. నిరుద్యోగులకు ఆశాజనకమైన సమాచారం అందుతుంది. ప్రింటింగ్ రంగాల వారికి పనివారలతో చికాకులు తప్పవు. లక్ష్య సాధనకు విద్యార్ధులు మరింతగా శ్రమించాలి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిదికాదు.
 
తుల :- ఆదాయ వ్యయాల్లో మీ అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. ఎప్పటి సమస్యలు అప్పుడే పరిష్కరించకోవటం ఉత్తమం. ఆత్మీయుల ఆకస్మిక రాక సంతోషం కలిగిస్తుంది. భాగస్వామిక వ్యాపారాల్లో మీ ఆధిపత్యానికి భంగం కలుగవచ్చు. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమంచి పెండింగ్ పనులు పూర్తి చేస్తారు.
 
వృశ్చికం :- వాణిజ్య ఒప్పందాలు, లీజు, ఏజెన్సీల వ్యవహారాలు వాయిదా వేయటం మంచిది. నిరుద్యోగులకు అందిన ఉద్యోగ సమాచారం కొత్త ఆశలను కలిగిస్తుంది. నమ్మకం, పట్టుదలతో మీ యత్నాలు సాగించండి, సత్ఫలితాలు లభిస్తాయి. రావలసిన ధనం సకాలంలో అందుట వల్ల ఆర్ధిక ఇబ్బందులు ఉండవు.
 
ధనస్సు :- కుటుంబీకులు, సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. స్త్రీలు విలువైన వస్తువులు, గృహోపకరణాలు అమర్చుకోగల్గుతారు. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తి చేస్తారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య తరచు కలహాలు, పట్టింపులు చోటుచేసుకుంటాయి.
 
మకరం :- ప్రయాణాలు వాయిదా పడతాయి. మీ ఉన్నతిని చూసి అసూయపడే వారు అధికమవుతున్నారని గమనించండి. విదేశీయాన యత్నాలలో ఆటంకాలు తొలగిపోగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడుట మంచిది. ఉద్యోగస్తులు కొత్తగా వచ్చిన అధికారులను ఆకట్టుకుంటారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
 
కుంభం :- చేపట్టిన పనులు సక్రమంగా సాగక విసుగు కలిగిస్తాయి. ఖర్చులు అధికమవుతాయి. రుణాలు, చేబదుళ్ళు తప్పకపోవచ్చు. విద్యార్థులకు శ్రమకు తగిన ప్రతిఫలం కానవస్తుంది. పత్రికా సిబ్బందికి ఒత్తిడి, పనిభారం అధికం. ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు.
 
మీనం :- ఎవరినీ సంప్రదించకుండా సొంతంగా తీసుకున్న నిర్ణయాలు ఇబ్బందులకు గురిచేస్తాయి. దుబారా ఖర్చులు అధికమవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలు తొలగిపోగలవు. కలంకారీ, చేనేత, పీచు వ్యాపారస్తులకు, చిన్నతరహా పరిశ్రమల్లో వారికి కలిసిరాగలదు. అనుకోకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారు.