మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 14 ఏప్రియల్ 2022 (14:32 IST)

సంగ్రహాలయ మ్యూజియంను ప్రారంభించిన ప్రధానమంత్రి

modi
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గురువారం సంగ్రాహాలయ మ్యూజియాన్ని ప్రారంభించారు. ఈ మ్యూజియంను ప్రారంభించి తొలి టికెట్‌ను మోదీ కొనుగోలు చేశారు. కాగా, ఈ మ్యూజియాన్ని ఇప్పటి వరకు దేశాన్ని ఏలిన 14 మంది ప్రధానులకు మోడీ అంకితమిచ్చారు. 
 
గత ప్రధానుల జీవిత కథలు, వివిధ సవాళ్లు ఎదురైనప్పుడు దేశాన్ని ఎలా నడిపించారో తెలియజేసేలా మ్యూజియాన్ని రూపొందించారు. 14 మంది ప్రధానుల గురించి అవగాహన కల్పించడమే ఉద్దేశంగా ఈ మ్యూజియాన్ని నిర్మించినట్లు తెలిపారు. 
 
ఈ మ్యూజియంలో తొలి దేశ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రు, ఆయన సేవల సంబంధించి చిత్రాలున్నాయి. ప్రపంచం నలుమూలల నుండి ఆయనకు లభించిన అనేక బహుమతులను తొలిసారిగా ప్రదర్శించారు.
 
అలాగే దేశ చరిత్ర, స్వాతంత్య్ర సంగ్రామం నాటి కథనాలు కూడా మ్యూజియంలో పొందుపరిచారు. పార్టీలకతీతంగా ప్రధానుల సహకారాన్ని గుర్తించడమే దీని ఉద్దేశమని వెల్లడించారు.