మంగళవారం, 21 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 10 ఏప్రియల్ 2022 (11:01 IST)

దేశంలో కొత్తగా 1,054 కరోనా పాజిటివ్ కేసులు

pneumonia after corona
దేశంలో కొత్తగా మరో 1,054 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన ప్రకటన మేరకు గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 1,054 పాజిటివ్ కేసులు నమోదైనట్టు వెల్లడించింది. దీంతో ఇప్పటివరకు మొత్తం నమోదైన కేసుల సంఖ్య 4,30,35,271కు చేరుకుంది. 
 
ఇందులో 4,25,02,454 మంది బాధితులు ఈ వైరస్ నుంచి కోలుకున్నారు. మరో 5,21,685 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో మరో 11,132 యాక్టివ్ కేసులు ఉన్నాయి. గత 24 గంటల్లో 1,258 మంది ఈ వైరస్ నుంచి కోలుకోగా మరో 28 మంది మృత్యువాతపడ్డారు.