1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి

మహిళా బిల్లు.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర

Draupadi Murmu
లోక్‌సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు (33 శాతం) సీట్లు రిజర్వుకానున్నాయి. చట్టసభల్లో మహిళలకు మూడింట ఒక వంతు సీట్లు కేటాయించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగ 106వ సవరణ బిల్లుపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు. 
 
ఈ నెల 28న బిల్లుపై సంతకం చేసినట్లు కేంద్ర న్యాయమంత్రిత్వ శాఖ శుక్రవారం ఒక నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీంతో మహిళా రిజర్వేషన్‌ బిల్లు రాజ్యాంగ (106 సవరణ) చట్టంగా రూపం దాల్చింది. అయితే కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం విధించిన నిబంధనల కారణంగా ఈ బిల్లు చట్టరూపం దాల్చినా మహిళా రిజర్వేషన్‌ ఎప్పటి నుంచి అమలవుతుందన్న సందిగ్ధత నెలకొనివుంది.