24న తిరుమలకు రాష్ట్రపతి
రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ శ్రీవారి దర్శనార్ధం ఈ నెల 24న తిరుమలకు రానున్నట్లు చిత్తూరు జిల్లా కలెక్టర్ భరత్‌గుప్తా తెలిపారు.
ఈ నెల 24వ తేదీన ఉదయం 10.45 గంటలకు చెన్నై నుంచి ప్రత్యేక విమానంలో రాష్ట్రపతి తిరుపతికి చేరుకుంటారన్నారు.
అక్కడి నుంచి కారులో బయలుదేరి 11.40 గంటలకు తిరుమల పద్మావతి అతిథిగృహం చేరుకుంటారని, మధ్యాహ్నం తిరుమల శ్రీవారిని దర్శించుకుని ఆ తర్వాత అహ్మదాబాద్‌కు బయలుదేరి వెళతారని కలెక్టర్ పేర్కొన్నారు.
రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టారు. గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విమానాశ్రయంలో రాష్ట్రపతికి స్వాగతం పలుకనున్నారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన వివరాలు..
ఈ నెల 24న ఉదయం 10.45 గంటలకు రేణిగుంట విమానాశ్రయం. 11 గంటల 40 నిమిషాలకు తిరుమల చేరుకుని పద్మావతి అతిథి గృహంలో బస. 12 గంటల 40 నిమిషాలకు శ్రీవారి దర్శనం. 1:50 నిమిషాలకు తిరిగి పద్మావతి అతిథి గృహం చేరుకుని విశ్రాంతి. 3.15 నిమిషాలకు తిరుమల నుంచి తిరుపతి విమానాశ్రయానికి పయనం. 4.10గంటలకు తిరుపతి విమానాశ్రయం నుంచి అహ్మదాబాద్ కు పయనం.