శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr

ఒక్క యేడాది మాత్రమే గవర్నర్‌ ఉండాలి : కిరణ్ బేడీ సంచలన నిర్ణయం

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాది మాత్రమే తాను గవర్నర్‌గా ఉంటానని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా, అధికారులతో మాట్లాడుతూ..

పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరో ఏడాది మాత్రమే తాను గవర్నర్‌గా ఉంటానని ప్రకటించారు. రాజ్‌భవన్‌లో పలు అంశాలపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా, అధికారులతో మాట్లాడుతూ.. ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. 
 
రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించేందుకు శాయశక్తులా కృషి చేస్తున్నానని చెప్పారు. తనకున్న విస్తృతమైన అనుభవాన్ని అధికారులు ఉపయోగించుకోవాలని అన్నారు. 
 
మరోవైపు, కిరణ్ బేడీని బదిలీ చేయాలంటూ అక్కడ అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధుల విధులను అడ్డుకుంటూ, పోటీ ప్రభుత్వాన్ని నడుపుతున్నారన్నారు.