సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : గురువారం, 29 డిశెంబరు 2016 (13:23 IST)

పూణే మహిళా టెక్కీ హత్య కేసులో నిందితుడి అరెస్ట్

మహారాష్ట్రలోని ఫూణే నగరంలో జరిగిన 23 యేళ్ల మహిళా సాప్ట్‌వేర్ ఇంజినీరు హత్య కేసులో మిస్టరీ వీడింది. బెంగళూరుకు చెందిన స్నేహితుడే తన ప్రేమను కాదన్నదనే ఆగ్రహంతో మహిళా సాప్ట్‌వేర్ ఇంజినీరు అంతారాను కత్తిత

మహారాష్ట్రలోని ఫూణే నగరంలో జరిగిన 23 యేళ్ల మహిళా సాప్ట్‌వేర్ ఇంజినీరు హత్య కేసులో మిస్టరీ వీడింది. బెంగళూరుకు చెందిన స్నేహితుడే తన ప్రేమను కాదన్నదనే ఆగ్రహంతో మహిళా సాప్ట్‌వేర్ ఇంజినీరు అంతారాను కత్తితో పొడిచి చంపాడని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. దీంతో అతడిని అరెస్టు చేశారు. 
 
కోల్‌కతాకు చెందిన అంతారా బెంగళూరులో సాప్ట్‌వేర్ శిక్షణ తీసుకుంటున్న సమయంలో తోటి ఉద్యోగి అయిన సంతోష్ కుమార్‌తో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయాన్ని అడ్డుపెట్టుకుని అంతారా వద్ద పెళ్లి ప్రస్తావన సంతోష్ కుమార్ తెచ్చాడు. దీన్ని ఆమె తిరస్కరించింది. 
 
అనంతరం అంతారా పూణే నగరంలోని తల్వాడే ప్రాంతంలోని కాప్ జెమినీ సంస్థలో చేరారు. అంతారా తండ్రి దేబానంద దాస్ అందించిన సమాచారంతో పోలీసులు బెంగళూరుకు చెందిన సాప్ట్‌వేర్ ఇంజనీరు సంతోష్ కుమార్‌ను పట్టుకువచ్చి ప్రశ్నించారు.
 
దీంతో తన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించిందనే కోపంతోనే అంతారాను కత్తితో పొడిచి చంపినట్లు కుమార్ అంగీకరించాడు. దీంతో తాము సంతోష్ కుమార్‌ను అరెస్టు చేసి రిమాండుకు తరలించినట్లు పూణే అదనపు ఎస్పీ రాజ్ కుమార్ షిండే చెప్పారు.