శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 18 మే 2021 (19:18 IST)

సహజీవనం ఆమోదయోగ్యమైన విషయం కాదు... హర్యానా హైకోర్టు

సహజీవనంపై అంగీకారం కోరుతూ కోర్టును ఆశ్రయించిన జంటకు చుక్కెదురైంది. తమకు ప్రాణ హాని ఉందంటూ.. కాపాడాలని ఓ జంట హర్యానా కోర్టును ఆశ్రయించింది. వాళ్లిద్దరూ సహజీవనంలో ఉంటున్నామని చెప్పి కోర్టులో పిటిషన్ వేశారు. అయితే దానిని నైతికంగా, సామాజికంగా ఆమోదయోగ్యమైన విషయం కాదని పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు కొట్టేసారేసింది.
 
పిటిషనర్లు 19ఏళ్ల గుల్జా కుమారీ, 22ఏళ్ల గుర్వీందర్ సింగ్ కలిసి ఉంటున్నామని త్వరలోనే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు పిటిషన్‌లో తెలిపారు. అమ్మాయి కుటుంబం తరపు నుంచి ప్రాణ హాని ఉందని పేర్కొన్నారు.
 
ప్రస్తుతమున్న విషయానికొస్తే.. పిటిషన్‌లో ప్రొటెక్షన్ కల్పించాలని ఎక్కడా లేదు. దానిని బట్టే పిటిషన్‌ను కొట్టేశాం’ అని జస్టిస్ హెచ్ఎస్ మదాన్ మే11న వెల్లడించారు. పిటిషనర్ కౌన్సిల్ ను బట్టి జేఎస్ ఠాకూర్, సింగ్, కుమారీలు తార్న్ తరణ్ జిల్లాలో ఉంటున్నారు.
 
కుమారి తల్లిదండ్రులు లుధియానాలో ఉంటున్నారు. వారిద్దరూ కలిసి ఉండటాన్ని వాళ్లు ఒప్పుకోలేదు. కుటుంబానికి సంబంధించిన వివరాలు ఏవీ ఇవ్వకపోగా వయస్సుకు సంబంధించిన డాక్యుమెంట్లు కూడా ఆ జంట అందించలేకపోయింది.