బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 23 అక్టోబరు 2020 (15:27 IST)

పంజాబ్‌లో దారుణం: ఆరేళ్ల చిన్నారిపై తాత, మనవళ్లు అత్యాచారం..

దేశంలో మహిళలపై అత్యాచారాలు రోజు రోజు పెరిగిపోతున్నాయి. వయోబేధం లేకుండా మహిళలపై అఘాయిత్యాలు పెచ్చరిల్లిపోతున్నాయి. చిన్న పిల్లలను సైతం వదలడం లేదు కామాంధులు. పంజాబ్‌లో ఆరు సంవత్సరాల చిన్నారిపై తాత, మనవళ్లు అత్యాచారానికి పాల్పడ్డారు. చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్ళి రేప్ చేసి, హత్య చేశారని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు.
 
దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు కేసులో నిందితులైన గుర్ ప్రీత్ సింగ్, అతని తాత సర్జిత్ సింగ్ లను నిందితులుగా గుర్తించారు. చిన్నారి మృతదేహాన్ని నిందితుల ఇంట్లో పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై అత్యాచారం, హత్యకు సంబంధించిన కేసులు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు.