శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 8 జూన్ 2022 (16:49 IST)

వేధిస్తావా.. అత్యాచార నిందితుడిని చంపేసిన బాధితురాలు

victim
రాజస్థాన్‌‌లోని అల్వార్‌లో అత్యాచార బాధితురాలు నిందితుడిని హత్య చేసింది. అత్యాచారం చేసిన వ్యక్తి మాజీ సర్పంచ్ కుమారుడని తెలిసింది. వివరాల్లోకి వెళితే.. బాలికపై మాజీ సర్పంచ్ కుమారుడు బ్లాక్ మెయిల్ చేస్తూ చాలా కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. 
 
ఆ తర్వాత తన సహోద్యోగులతో కూడా సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఇది తట్టుకోలేని బాలిక.. పొలంలోకి పిలిచి అతన్ని చంపేసింది. ఘటన జరిగిన సమయంలో యువకుడు మద్యం మత్తులో ఉన్నాడు. అతని మృతదేహం మే 18న అల్వార్‌లోని కోట్‌కాసిమ్ ప్రాంతంలో రోడ్డు పక్కన కనిపించింది. 
 
వివరాల్లోకి వెళితే.. బాలికపై మాజీ సర్పంచ్ కుమారుడు బ్లాక్ మెయిల్ చేస్తూ చాలా కాలంగా అత్యాచారం చేస్తున్నాడు. ఆ తర్వాత తన సహోద్యోగులతో కూడా సంబంధాలు పెట్టుకోవాలని ఒత్తిడి తెచ్చేవాడు. ఇది తట్టుకోలేని బాలిక.. పొలంలోకి పిలిచి అతన్ని చంపేసింది.  
 
మే 17వ తేదీ రాత్రి మాజీ సర్పంచ్ ధనిరామ్ యాదవ్ కుమారుడు విక్రమ్ యాదవ్ (45) హత్యకు గురయ్యాడని గ్రామానికి చెందిన భివాడి ఏఎస్పీ అతుల్ సాహు తెలిపారు. మైనర్ బాలిక విక్రమ్ యాదవ్ ఇంటికి నీళ్ల కోసం వెళ్లేదని ఏఎస్పీ సాహు తెలిపారు.  
 
విక్రమ్‌ పెట్టే చిత్రహింసలు తట్టుకోలేక ఎలాగైన అతన్ని బాధితురాలు అంతం చేయాలనుకుంది. పథకం ప్రకారం మే 17న రాత్రి తనను కలవాలని విక్రమ్‌కు ఫోన్ చేసింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న విక్రమ్‌ యాదవ్‌ను గొంతు కోసి హతమార్చింది. ఈ కేసులో మైనర్‌ బాలికతో పాటు నలుగురిపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.