శనివారం, 28 డిశెంబరు 2024
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. వార్తలు
Written By ఠాగూర్

నేడు ఐపీఎల్ క్వాలిఫయర్-2 - రాజస్థాన్ వర్సెస్ బెంగుళూరు ఢీ

ipl2022
ఐపీఎల్ 15వ సీజన్ పోటీల్లో భాగంగా, శుక్రవారం క్వాలిఫయర్-2 మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్, బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోస ఇరు జట్లూ సర్వసన్నద్ధంగా ఉన్నాయి. బ్యాటింగ్ ప్రధాన బలంగా బరిలోకి దిగే జట్టు ఒకటైతే, అన్ని విభాగాల్లో సమతూకంగా ఉన్న జట్టు మరొకటి. 
 
ముఖ్యంగా లీగ్ ఆరంభ సీజన్‌లో విజేతగా నిలిచిన రాజస్థాన్ రాయల్స్ ఇప్పటివరకు ఒక్కసారిగా కూడా టైటిల్ నెగ్గలేదు. ఇపుడు ఫైనల్‌లో అడుగుపెట్టేందుకు రాయల్ చాలెంజర్స్ బెంగుళూరు జట్టుతో తలపడనుంది. అహ్మదాబాద్ వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ జట్టుతో టైటిల్ కోసం తలపడుతుంది. 
 
మరోవైపు, గత మ్యాచ్‌లో గుజరాత్ చేతిలో ఓడిన రాజస్థాన్ కాస్త డీలాపడింది. లక్నోపై విజయంతో బెంగుళూరు జట్టు మంచి జోరుమీదుంది. ఇతర జట్ల గెలుపోటములతో ఆధారపడి అడుగుపెట్టిన బెంగుళూరు జట్టు, ఎలిమినేటర్ సమిష్టిగా సత్తా చాటింది. కెప్టెన్ డుప్లెసిస్, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, స్టార్ ఆల్‌రౌండర్ మ్యాక్స్‌వెల్ వంటి స్టార్ ఆటగాళ్లు విఫలమైన వేళ అనామక ఆటగాడు రజత్ పాటిదార్ విధ్వంసం సృష్టించి, లక్నో బౌలర్లను చీల్చి చెండాడుతూ ఫోర్లు, సిక్సర్లతో ఈడెన్ గార్డెన్స్‌లో అజేయ శతకంతో విశ్వరూపం చూపించాడు. అతడితి దినేశ్ కార్తీక్ మెరుపులు తోడుకావడంతో ఆర్సీబీ జట్టు లక్నోను చిత్తు చేసింది. 
 
ఇకపోతో పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న రాజస్థాన్ రాయల్ జట్టు గత మ్యాచ్‌లో మంచి స్కోరు చేసినప్పటికీ గుజరాత్ హిట్టర్ల దెబ్బకు భారీ మూల్యం చెల్లించుకుంది. జోస్ బట్లర్, సంజూ శాంసన్ ఫామ్‌లో ఉన్నారు. అలాగే, బౌలర్లు మెరుగ్గా రాణిస్తున్నారు. ఈ రెండు ఆ జట్టుకు కలిసివచ్చే అంశాలుగా చెప్పుకోవచ్చు.