గురువారం, 28 సెప్టెంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 24 మే 2023 (13:06 IST)

38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల బాలిక వివాహం.. రూ.4.50 లక్షలకు కొనుగోలు చేసి..?

woman
రాజస్థాన్‌లోని ధోల్‌పూర్ జిల్లాలో ఓ కుటుంబం 38 ఏళ్ల వ్యక్తితో ఏడేళ్ల బాలికను ఇచ్చి పెళ్లి చేసింది. రూ. 4.50 లక్షలకు కొనుగోలు చేసిన ఆ కుటుంబం ఈ నెల 21న 38 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిపించింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఓ హత్య కేసులో కుటుంబ సభ్యులు కొందరు జైలు శిక్ష అనుభవించిన తర్వాత నిందితుడి కుటుంబం మానియాలో స్థిరపడినట్టు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. 
 
ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి ఇంటిపై దాడిచేసి బాలికను కాపాడారు. బాలికను రూ. 4.50 లక్షలకు విక్రయించినట్టు ఆమె తండ్రి అంగీకరించినట్టు పోలీసులు చెప్పారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. పరారీలో వున్న నిందితుడిని గాలించే చర్యలు తీసుకున్నారు.