శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 4 జనవరి 2022 (16:23 IST)

రాజస్థాన్‌లో ఘోరం: 16 ఏళ్ల మైనర్ బాలికపై అకృత్యం

రాజస్థాన్‌లో ఘోరం జరిగింది. 16 ఏళ్ల మైనర్ బాలికపై అకృత్యం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని బుండీకి చెందిన 16 ఏళ్ల మైనర్‌ బాలిక గత నెల 23న మేకలు మేపడానికి అడవికి వెళ్లి అదృశ్యమైంది. దీంతో బాలిక మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఇటీవల బాలిక బుండీకి సమీపంలోని అడవుల్లో శవమై కనిపించింది. 
 
ఇక ఈ కేసును హత్య కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించగా నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. బాలికపై సాముహిక అత్యాచారం జరిగిందని, అతి కిరాతకంగా ఆమెను చంపి, ఆపై కూడా కామాంధులు వదలలేదని తేలింది. అంతేకాకుండా ఆమె ప్రైవేట్ భాగాలలో 30 వరకు గాయాలు ఉన్నాయని, బాలిక ఎంతో నరకాన్ని అనుభవించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.