సోమవారం, 2 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 11 జనవరి 2024 (17:14 IST)

పండంటి బిడ్డకు జన్మనిచ్చిన 14ఏళ్ల బాలిక.. స్కూలుకు గర్భంతోనే..?

కర్ణాటకలో పద్నాలుగేళ్ల వయసులోనే గర్భం దాల్చిన ఓ బాలిక పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తొమ్మిదొవ తరగతి చదువుతున్న అమ్మాయి తొమ్మిది నెలలుగా కడుపులో బిడ్డను మోస్తూనే స్కూలుకు వెళ్లింది. 
 
బాగేపల్లి హాస్టల్‌లో వుంటూ తొమ్మిదో తరగతి చదువుకుంటూ వచ్చిన బాలిక తీవ్రమైన కడుపునొప్పితో టీచర్స్ సాయంతో తల్లిదండ్రులు ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ ఇంజెక్షన్‌ వేసి కొన్ని మందులిచ్చి పంపించేశారు వైద్యులు. 
 
అయితే మళ్లీ కడుపునొప్పి రావడంతో ఆస్పత్రికి తరలించారు. వైద్యులు పరిశీలించి బాలిక నిండు గర్భిణి అని తెలిపారు. ప్రసవం నొప్పుల కారణంగానే ఆమె కడుపునొప్పి వస్తుందని చెప్పి వెంటనే బాలికకు కాన్పు చేయగా.. మగబిడ్డ జన్మించాడు. 
 
అయితే ఆ చిన్నారి పసిబిడ్డకు జన్మనివ్వడం చూసి డాక్టర్లు, పేరెంట్స్ అయోమయానికి గురయ్యారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. హాస్టల్ వార్డెన్, ఇతర సిబ్బందిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.