1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : మంగళవారం, 2 జనవరి 2024 (16:36 IST)

అయోధ్యలో రామవిగ్రహం.. 37ఏళ్ల శిల్పి చెక్కారు.. ఆయన సంగతేంటి?

Ram Idol
Ram Idol
అయోధ్యలో రామమందిరంలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జనవరి 22న జరగనుంది. కర్ణాటక ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ రామ్‌లాలా విగ్రహాన్ని అయోధ్యలో నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించనున్నారు. 
 
బీజేపీ నేత, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి బీఎస్ యడ్యూరప్ప సోమవారం ఈ మేరకు సమాచారం అందించారు. ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో రామమందిర ప్రతిష్ఠాపన ప్రధానమంత్రి నరేంద్రమోదీ చేతుల మీదుగా జరగనుంది. 
 
ఈ శిల్పం అద్భుతంగా చెక్కబడింది. ఈ విజయాన్ని సాధించినందుకు శిల్పి అరుణ్ యోగిరాజ్‌ను బిఎస్ యడ్యూరప్ప అభినందించారు. శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేసేందుకు శ్రీ రామజన్మభూమి యాత్రా స్థలం నుండి ముగ్గురు శిల్పులను ఎంపిక చేశారు. 
 
ఈ శిల్పులలో అరుణ్ యోగిరాజ్ ఒకరు. ఈ సందర్భంగా శిల్పి అరుణ్ యోగిరాజ్ మాట్లాడుతూ.. 'శ్రీరాముని మనోహరమైన, శోభాయమానమైన విగ్రహాన్ని రూపొందించేందుకు ఎంపికైన దేశంలోని ముగ్గురు శిల్పులలో నేనూ ఒకడిని కావడం చాలా సంతోషంగా ఉంది... అని అన్నారు. 
 
ఇదిలా ఉంటే అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ వేడుకకు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. జనవరి 22, 2024న అయోధ్యలో రాంలాలా మహా సంప్రోక్షణ మహోత్సవం జరగనుంది. అయోధ్యలోని అద్భుతమైన ఆలయంలో, శ్రీరాముని విగ్రహం వెలిగిపోనుంది. 
 
శిల్పి అరుణ్ యోగిరాజ్ కర్ణాటకలోని మైసూర్ నగరంలో నివాసం ఉంటున్నారు. అరుణ్ యోగిరాజ్ తన కుటుంబం నుండి శిల్ప కళను వారసత్వంగా పొందారు. ఆయన ప్రసిద్ధ శిల్పుల కుటుంబం నుండి వచ్చారు. వాటిలో ఐదు తరాలు విగ్రహాలను తయారు చేయడానికి పని చేశాయి.
 
దేశంలోని ప్రముఖ శిల్పులలో అరుణ్ యోగిరాజ్ ఒకరు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో అరుణ్ రూపొందించిన చెక్కిన విగ్రహాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. అరుణ్ నైపుణ్యాన్ని స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసించారు. 
 
అరుణ్ యోగిరాజ్ తన నైపుణ్యాన్ని ఉపయోగించి అనేక శిల్పాలను రూపొందించారు. ఇప్పుడు అయోధ్యలోని రామమందిరంలో కొలువై ఉన్న శ్రీరాముడి విగ్రహాన్ని కూడా సృష్టించే భాగ్యం ఆయనకు దక్కింది.
 
అరుణ్ యోగిరాజ్ ప్రముఖ శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు. 37 ఏళ్ల అరుణ్ యోగిరాజ్ ప్రముఖ కర్ణాటక శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు. ఇది మాత్రమే కాదు. అరుణ్ యోగిరాజ్ తాత వడియార్ కుటుంబానికి చెందిన ప్యాలెస్‌లను అందంగా తీర్చిదిద్దడంలో కూడా ప్రసిద్ది చెందారు. 
 
అరుణ్ యోగిరాజ్ 2008లో మైసూర్ యూనివర్శిటీలో ఎంబీఏ పూర్తి చేశారు. చిన్నప్పటి నుంచి ఆయనకు శిల్పకళ నేర్పించారు. అరుణ్ మైసూర్ ప్యాలెస్ నుండి వచ్చిన కళాకారుల కుటుంబం నుండి వచ్చారు. అరుణ్‌కి తన పూర్వీకుల తరహాలో శిల్పి కావాలనుకోలేదు. 
 
2008లో మైసూర్ యూనివర్సిటీలో ఎంబీఏ చేసిన ఆయన.. ఆ తర్వాత ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేశారు. అరుణ్ గొప్ప శిల్పి అవుతాడని అతని తాత చెప్పారు. ఎట్టకేలకు 37 సంవత్సరాల తర్వాత, అతని తాత మాటలు నిజమయ్యాయి.
 
శ్రీరాముని విగ్రహాన్ని తయారు చేసేందుకు శ్రీ రామజన్మభూమి యాత్రా స్థలం నుండి ముగ్గురు శిల్పులను ఎంపిక చేశారు. ఈ శిల్పులలో అరుణ్ యోగిరాజ్ ఒకరు. అరుణ్ ఎంపికైనప్పటి నుండి అతని కుటుంబం చాలా హ్యాపీగా ఉంది. 
 
ఎట్టకేలకు మంగళవారం శ్రీరాముని విగ్రహం పూర్తికాగా, వచ్చే 22వ తేదీన అయోధ్యలోని రామమందిరంలో అరుణ్ తయారు చేసిన శ్రీరాముడి విగ్రహం కొలువుదీరనుంది. ఈ విషయం తెలుసుకున్న అరుణ్ తల్లి ఆనందభాష్పాలు రాల్చారు.