ఆదివారం, 3 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 7 అక్టోబరు 2024 (17:59 IST)

రతన్ టాటా ఆరోగ్యంపై వదంతులు... తాను బాగానే ఉన్నానంటూ ప్రకటన

Ratan tata
భారత పారిశ్రామిక దిగ్గజం రతన్ టాటా ఆరోగ్యంపై అనేక వదంతులు వస్తున్నాయి. ఆయన ఆరోగ్యం క్షీణించిందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ అవుతుంది. దాంతో వ్యాపార వర్గాల్లో కలకలం రేగింది. రతన్ టాటాకు ఏమైందంటూ సోషల్ మీడియా వేదికగా చర్చ సాగుతుంది. ఈ నేపథ్యంలో ఈ వదంతులపై రతన్ టాటానే స్వయంగా స్పందించారు. ఈ మేరకు ఆయన తన ట్విట్టర్ ఖాతాలో ఓ ప్రకటన చేశారు. 
 
"నా ఆరోగ్యం గురించి ఇటీవల వస్తున్న పుకార్లపై నా దృష్టికి వచ్చాయి. అయితే, ఈ వార్తల్లో ఏమాత్రం నిజం లేదని అందరికీ తెలియజెప్పాలనుకుంటున్నాను. నా వయసు రీత్యా, ఆరోగ్యం రీత్యా ప్రస్తుతం కొన్ని వైద్యపరమైన పరీక్షలు చేయించుకుంటున్నాను. ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. నేను ప్రస్తుతం బాగానే, ఉల్లాసంగానే ఉన్నాను. తప్పుడు సమాచారం వ్యాప్తి చేయొద్దని ప్రజానీకాన్ని మీడియాను కోరుతున్నాను" అంటూ రతన్ టాటా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అలాగే, తన ఆరోగ్యం పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్న వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపింది.