గురువారం, 5 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 అక్టోబరు 2024 (15:23 IST)

సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరన్న పవన్ - వెయిట్ అండ్ సీ అంటున్న ఉదయనిధి...

udayanidhi stalin
సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరంటూ ఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ తనదైనశైలిలో స్పందించారు. వెయిట్ అండ్ సీ అంటూ ఒక్క ముక్కలో చెప్పారు. శుక్రవారం చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన వద్ద మీడియా తిరుపతి వేదికగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా, డిప్యూటీ సీఎం ఉదయనిధి పై విధంగా కామెంట్స్ చేశారు. 
 
కాగా, సనాతన ధర్మంపై గతంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా పెను దుమారాన్ని రేపిన విషయం తెల్సిందే. సనానత ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాలతో ఆయన పోల్చారు. దీనిపై భారతీయ జనతా పార్టీ నేతలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గురువారం తిరుపతిలో జరిగిన వారాహి డిక్లరేషన్ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సనానత ధర్మంపై విమర్శలు చేసే వారిని లక్ష్యంగా చేసి ప్రసంగించారు. పైగా తమిళంలో మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్‌కు కౌంటర్ ఇచ్చారు. 
 
సనాతన ధర్మాన్ని ఎవరూ నిర్మూలించలేరని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎలా ఎవరైనా ప్రయత్నిస్తే మీరే కొట్టుకునిపోతారన్నారు. తాను సనాతన హిందువునని, మీలాంటి వ్యక్తులు రావొచ్చు.. పోవచ్చు కానీ సనాతన ధర్మం ఎప్పటికీ నిలిచివుంటుందని చెప్పారు.