శుక్రవారం, 10 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 జనవరి 2023 (16:16 IST)

మార్చురీలో ఎలుకలు.. శవం కన్ను తినేశాయి.. ఎక్కడ?

rats
ఎలుకలు ఇంట్లో వుంటూనే నానా హంగామా చేస్తాయి. అదీ మార్చురీలో వుంటే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం వల్ల ఎన్నో దారుణాలు వెలుగుచూస్తున్నాయి. తాజాగా మధ్యప్రదేశ్‌లో ఇలాంటి దారుణం చోటుచేసుకుంది.  
 
వివరాల్లోకి వెళితే.. ఎంపీలోని సాగర్ జిల్లా ఆస్పత్రిలో సిబ్బంది ఇటీవల ఓ శవాన్ని మార్చురీలో భద్రపరిచారు. అయితే మరుసటి రోజు ఇదే శవాన్ని సిబ్బంది పరిశీలించగా కన్ను పూర్తిగా దెబ్బతినింది. దీనిని గమనించిన సిబ్బంది వెంటనే వైద్యులకు తెలియజేశారు. 
 
శవం కన్ను ఎలుకలు తినేశాయని అధికారులు, వైద్యులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీటీవీ కెమెరాలను  పరిశీలిస్తున్నారు.