శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 24 ఏప్రియల్ 2023 (18:18 IST)

పెళ్లికి ముందు ప్రెగ్నెన్సీ టెస్ట్ - గర్భవతులుగా నిర్ధారణ

pregnency
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కొందరు యువతులకు గర్భ నిర్ధారణ పరీక్షలు చేశారు. ఈ పరీక్షల్లో నలుగురు యువతులు గర్భందాల్చినట్టు తేలింది. దీంతో ఆ యువతులు షాకవుతున్నారు. దేశంలో ఆడపిల్లల సంరక్షణార్థం ప్రభుత్వాలు అనేక పథకాలను ప్రవేశపట్టి అమలు చేస్తున్నాయి. ఈ కోవలో భాగంగా, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సీఎం కన్యా వివాహ యోజన అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద దరఖాస్తు చేసుకునే నిరుపేద యువతులకు ప్రభుత్వం పెళ్లి చేస్తుంది. ఇక్కడ వరకు అంతా బాగానే ఉంది. 
 
అయితే, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయమే ఇపుడు వివాదాస్పదమైంది. దరఖాస్తు నిమిత్తం పెళ్లిళ్లు చేసుకునే అమ్మాయిలు ప్రెగ్నెన్సీ టెస్టులు చేయించుకుని ఆ రిపోర్టులు దరఖాస్తుతో జత చేయాలని సూచన చేసింది. ఈ నిర్ణయంపై విపక్ష పార్టీల నేతలతో పాటు రాష్ట్ర ప్రజలు తీవ్రంగా మండిపడుతున్నారు. మరోవైపు, ఇప్పటివరకు చేసిన ప్రెగ్నెన్సీ టెస్టుల్లో నలుగురు యువతులు గర్భవతులని తేలడంతో ఈ వివాదం మరింత పెద్దది అయింది. పెళ్లి కావాల్సిన ఆడపిల్లలకు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయడం వారిని తీవ్రంగా అవమానించడమే అవుతుందని విపక్ష నేతలు మండిపడుతున్నారు.