గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 28 అక్టోబరు 2022 (16:09 IST)

నిత్యామీనన్ ప్రెగ్నెంట్.. ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేసింది.. అద్భుతం మొదలైందట!

nithya menon
టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ నిత్యామీనన్ ప్రెగ్నెంట్ అయ్యింది. అవునా మీరు చదువుతున్నది నిజమే. వివరాల్లోకి వెళితే.. ఇటీవల భీమ్లా నాయక్, తిరు చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు తన ఇన్ స్టాలో షేర్ చేసిన ఫోటో అభిమానులను అయోమయంలో పడేసింది. 
 
ఫాసిఫైయర్‏తో పాటు ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ షేర్ చేస్తూ.. అద్భుతం మొదలైంది అంటూ క్యాప్షన్ ఇచ్చింది. దీంతో ఆమె షేర్ చేసిన పోస్ట్ పై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. 
 
ప్రెగ్నెన్సీ టెస్ట్ కిట్ పోస్ట్ చేయడమేంటీ ?.. నీకు పెళ్లి జరిగిందా ? అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే తన తదుపరి చిత్రంలో భాగంగా ఈ ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసినట్లుగా తెలుస్తోంది.
 
తన నెక్ట్స్ ప్రమోషన్స్ కోసమే నిత్యా ఇలా ప్రెగ్నెన్సీ కిట్ షేర్ చేసిందని.. మరే రీజన్ లేదని అంటూన్నారు ఆమె ఫ్యాన్స్. కానీ నిత్యా మాత్రం తను గురించి వస్తున్న కామెంట్స్‌పై ఇంకా స్పందించలేదు.