మంగళవారం, 30 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 జనవరి 2023 (10:58 IST)

పని లేకపోవడం వల్లే అమ్మాయిలను ఇవ్వడం లేదు : శరద్ పవార్

sharad pawar
మహారాష్ట్రలో అనేక మంది యువకులకు పెళ్లిళ్లు కావడం లేదు. దీనికి కారణం తమ ఆడపిల్లలను ఇచ్చేందుకు తల్లిదండ్రులు ముందుకు రావడం లేదు. ఉద్యోగాలు లేని కారణంగా పెళ్లి చేసుకోవాడనికి అమ్మాయిలు దొరడం లేదు. దీనిపై ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి, మరాఠా రాజకీయ యోధుడు శరద్ పవార్ స్పందిస్తూ, ఉద్యోగం లేని వ్యక్తికి పిల్లను ఎవరు ఇస్తారని తెలిపారు. ఒకసారి తాను ఒక ఊరికి వెళ్లాను. 
 
అక్కడ 30 యేళ్లలోపు వయస్సున్న కొందరు యువకులు పిచ్చాపాటిగా మాట్లాడుకుంటున్నారని, ఎందుకు ఖాళీగా ఉన్నారని తాను ప్రశ్నిస్తే తమ ప్రాంతంలో తాము చేయడానికి పనులు లేవని చెప్పారని తెలిపారు. వారిలో డిగ్రీలు, బీటెక్‌లు చేసిన యువకులు ఉన్నారని చెప్పారు. పని లేకపోవడంతో అమ్మాయిని ఇవ్వడానికి కూడా ఎవరూ ముందుకు రావడం లేదని చెప్పారు. చదువుకున్న వాళ్ళు తమకు ఉద్యోగాలు కావాలని ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆయన సూచించారు. 
 
దేశంలో మహారాష్ట్రలో నిరుద్యోగు పెరిగిపోతోందన్నారు. ఎన్నికల సమయంలో ఉద్యోగాల హామీని ఇచ్చిన బీజేపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మాట మరిచిపోయారని అన్నారు. మహారాష్ట్రలో తమ కూటమి అధికారంలో ఉన్నపుడు నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం కృషి చేశామని ఆయన చెప్పారు.