సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 13 జనవరి 2020 (11:39 IST)

శబరిమల వివాదం-సుప్రీంలో వాదనలు: మహిళల ప్రవేశంపై జోక్యంపై సమీక్ష

కేరళలోని సుప్రసిద్ధ క్షేత్రం శబరిమల ఆలయంలోకి అన్ని వయసుల మహిళలకు ప్రవేశం కల్పిస్తూ 2018లో సుప్రీం ధర్మాసనం ఇచ్చిన తీర్పును మరోసారి పరిశీలించాలంటూ ఇండియన్‌ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌ ప్రజా ప్రయోజన వాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై తొమ్మిదిమంది న్యాయమూర్తులతో కూడిన విస్తృత ధర్మాసనం 2020, జనవరి 13వ తేదీ సోమవారం వాదనలు విననుంది. 
 
శబరిమల ఆలయంలోకి అన్ని వయసులు గల మహిళలు వెళ్లవచ్చని సుప్రీం కోర్టు 2018 సెప్టెంబర్ 28న తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై 60 రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. 2019 నవంబర్ 14వ తేదీన విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. మహిళల ప్రవేశంపై న్యాయస్థానం ఎంతవరకు కలుగజేసుకునే అవకాశం ఉందనే అంశంపై రాజ్యాంగ ధర్మాసనం సమీక్షించనుంది. ఇంకా దీనికోసం వాదనలను విననుంది. 
 
శబరిమలతో పాటు దర్గాలు, మసీదుల్లోకి ముస్లిం మహిళల ప్రవేశం, ఇతర మతస్థుల్ని పెళ్లాడే పార్సీ మహిళకు మతపరమైన ప్రాంగణాల్లోకి ప్రవేశం లేకపోవడం వంటి అంశాలపై విచారణ జరుపనుంది.