శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 3 అక్టోబరు 2022 (09:28 IST)

ములాయం సింగ్ ఆరోగ్యం విషమం - ఐసీయుూకు తరలింపు

mulayam singh yadav
సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ములాయం సింగ్ యాదవ్ ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో ఆయన్ను అత్యవసర సేవల విభాగం ఐసీయూ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. 
 
అనారోగ్యం బారిన పడిన ఆయనను కొన్ని రోజుల క్రితం గురుగ్రామ్‌లోని మేదాంత హాస్పిటల్‌కు చికిత్స నిమిత్తం తరలించారు. అయితే, ఆదివారం ఆయన ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించడంతో ఐసీయూ వార్డుకు తరలించి చికిత్సనందిస్తున్నారు. 
 
ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ప్రముఖ వైద్య నిపుణులు సుషీలా కటారియా ములాయం సింగ్ యాదవ్‌ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు.