1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 7 జులై 2022 (09:17 IST)

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం విషమం

lalu - hospital
బీహార్ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఆయనకు మెరుగైన చికిత్స అందించేందుకు పాట్నా నుంచి ఢిల్లీ ఎయిమ్స్ ఆస్పత్రికి తరలించారు. 
 
పలు ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తన నివాసంలో మెట్లపై నుంచి పడిపోవడంతో కుడి భుజం ఎముక విరిగింది. ఈ నేపథ్యంలో కుటుంబ సభ్యులు ఆయనను పాట్నాలోని పరాస్ ఆస్పత్రికి తలించారు. అయితే, అక్కడ పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కసం ఢిల్లీకి తరలించారు. 
 
కాగా, గత కొంతకాలంగా లాలూ కిడ్నీ, హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు. అయితే, తన తండ్రి ఆర్యం ప్రస్తుతం స్థిరంగా ఉందని లాలూ కుమారుడు తేజస్వీ యాదవ్ తెలిపారు.