గురువారం, 25 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 20 మే 2022 (11:45 IST)

ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌పై సీబీఐ కేసు

lalu prasad yadav
ఇప్పటికే గడ్డి కుంభకోణం కేసులో జైలుశిక్షను అనిభవిస్తున్న ఆర్జేడీ అధినేత, కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్‌ను సీబీఐ టార్గెట్ చేసింది. ఆయనపై తాజాగా కేసు నమోదు చేశారు. 2004 నుంచి 2009 వరకు రైల్వే మంత్రిగా ఉన్న సమయంలో రైల్వే ఉద్యోగాల నియామకాలలో అవినీతికి పాల్పడ్డారంటూ లాలూ, ఆయన భార్య, బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి, కుమార్తె, రాజ్యసభ సభ్యురాలు మీరా భారతితో పాటు లాలూ కుటుంబ సభ్యులపై కేసు నమోదు చేసింది. అదేసమయంలో ఈ కేసుకు సంబంధించి లాలూ నివాసంతో పాటు 15 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు శుక్రవారం ఏకకాలంలో సోదాలు చేపట్టారు. 
 
గత యూపీఏ 1 ప్రభుత్వంలో లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే శాఖామంత్రిగా ఉన్నారు. ఆ సమయంలో ఆయన రైల్వేలో ఉద్యోగాలు ఇప్పినందుకుగాను లాలూ, ఆయన కుటుంబ సభ్యులు భూములు, ఆస్తుల రూపంలో లంచాలు స్వీకరించారని వీరిపై అభియోగాలు మోపారు. 
 
దీంతో సీబీఐ అధికారులు శుక్రవారం పాట్నాలోని ఆయన నివాసంతో పాటు 15 చోట్ల ఏకకాలంలో సోదాలకు దిగారు. పాట్నాలో సీబీఐ అధికారులు సోదాలు చేసే సమయంలో కేవలం రబ్రీదేవి ఒక్కరే ఉన్నారు. లాలూతో పాటు ఆయన కుమారుడు తేజస్వీ యాదవ్‌లు ఇంట్లో లేకపోవడం గమనార్హం.